ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి17 : ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయాల జాబితాలో ఖమ్మం జిల్లాలోని జిల్లాలో 37 పాఠశాలలు చేరాయి. రాష్ట్రస్థాయికి ఖమ్మం జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికవ్వగా.. ఇందులో కొత్తగూడెం పాఠశాలకు ప్రత్యేక ప్రశంస దక్కింది.
జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డును 2022-23కు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోని పాఠశాలలు పాల్గొన్నాయి. పాఠశాలలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలను పొందుపర్చింది. వాటిల్లో ఉన్న పాయింట్ల ఆధారంగా పాఠశాలలు స్వచ్ఛత వైపు అడుగు వేశాయి. అందుకు అధికారులు ప్రోత్సాహం, ప్రభుత్వం నుంచి నిర్వహణకు అవసరమైన స్కావెంజర్లు నిధులు విడుదల చేయడం ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించడంతో ఒకదానికొకటి కలిసొచ్చాయి. జిల్లాలో ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయిలో జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికై కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది అవార్డుల కోసం 1,512 విద్యాసంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి చైర్మన్‌గా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని విద్యాసంస్థలను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల్లో 23, పట్టణ ప్రాంతాల్లో 14 విద్యాసంస్థలను ఎంపిక చేశారు.
మెయిన్ కేటగిరీలో 8, సబ్ కేటగిరీలో 29 స్కూల్స్..
మెయిన్ కేటగిరీలో.. ఎంపీపీఎస్ రెబ్బావరం వైరా, ఎంపీపీఎస్ మల్లారం తల్లాడ, జడ్పీహెచ్ఎస్ అన్నారుగూడెం తల్లాడ, టీఎంఆర్ఈఐఎస్ బాయ్స్ సత్తుపల్లి, జడ్పీహెచ్ఎస్ ఎస్డీవీఆర్ బేతుపల్లి గంగారం సత్తుపల్లి, ఎంపీపీఎస్ సింగారెడ్డి పాలెం నేలకొండపల్లి, ఎంపీపీఎస్ కొత్తగూడెం ఖమ్మం అర్బన్, జడ్పీహెచ్ఎస్ చిన్న కొరుకోండి కల్లూర్ ఎంపికైయ్యాయి.
సబ్ కేటగిరిలో.. ఎంపీపీఎస్ బనిగండ్లపాడు ఎర్రుపాలెం, ఎంపీయూపీఎస్ గండగలపాడు వైరా, ఎంపీపీఎస్ గొల్లపూడి వైరా, ఎంపీయూపీఎస్ పుణ్యపురం వైరా, ఎంపీపీఎస్ నిమ్మగుడెం తల్లాడ, ఎంపీపీఎస్ అన్నారుగుడెం తల్లాడ, టీఎస్ఎంఎస్ కారేపల్లి, ప్రభుత్వ హైస్కూల్ అయ్యగారిపేట సత్తుపల్లి, ఎంపీయూపీఎస్ చింతగుర్తి రఘునాధపాలెం, ఎంపీయూపీఎస్ మర్లకుంట పెనుబల్లి, ఎంపీయూపీఎస్ కేఎం వారి బంజర పెనుబల్లి, జడ్పీహెచ్ఎస్ చింతగూడెం పెనుబల్లి, జడ్పీహెచ్ఎస్ మేడేపల్లి ముదిగోండ, ప్రభుత్వ టీవీఎం మధిర, ఎంపీయూపీఎస్ పాలేరు, జడ్పీహెచ్ఎస్ కూసుమంచి, ఎంపీపీఎస్ పల్లిపాడు కోణిజర్ల, ఎంపీపీఎస్ పెద్దమునగాల కోణిజర్ల, ఖమ్మంఅర్బన్ పరిధిలో ఎంపీపీఎస్ గోపాలపురం, ఎంపీపీఎస్ టేకులపల్లి, గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హార్వెస్ట్ స్కూల్, కృష్ణవేణి స్కూల్, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాయల్కిడ్స్, కేజీబీవీ కొత్తూరువై, ఎంపీపీఎస్ నారాయణపురం కల్లూరు, టీఎస్‌ఆర్‌ఈఐఎస్ ఏన్కూరు, ఎంపీపీఎస్ అనంతసాగర్ చింతకాని స్కూల్స్ ఉన్నాయి.
కొత్తగూడెం స్కూల్‌కి ప్రత్యేక ప్రశంస..
ఖమ్మం అర్బన్ మండలంలోని కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక ప్రశంస లభించింది. రాష్ట్రస్థాయి అవార్డుల కోసం జిల్లా నుంచి ఈ పాఠశాల నామినేట్ అయింది. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామస్తుల సహకారంతో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ఎంపికైన పాఠశాలలకు డీఈవో సోమశేఖరశర్మ అభినందనలు తెలిపారు. ఈ ఏడాదిలో జిల్లాలో 1 స్టార్, 2 స్టార్లలో ఉన్న విద్యాలయాలను 4 స్టార్ ప్రమాణాలు పొందేలా చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.