– మృతదేహాన్ని తరలించేందుకు తానా చర్యలు
– బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ
ఖమ్మం రూరల్, అక్టోబర్ 05 : రెండు రోజుల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన దారం సుప్రియ మరణం అత్యంత బాధాకరమని ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రి నగర్ లో నివాసముంటున్న సుప్రియ తల్లిదండ్రులను వారు పరామర్శించారు. తొలుత సుప్రియ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సుప్రియ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న సుప్రియ అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఆమె మృతదేహాన్ని భారతదేశానికి రప్పించేందుకు తానా, ఇతర అసోసియేషన్లు చర్యలు ప్రారంభించాయన్నారు. శుక్రవారం లోపు మృతదేహం ఇండియాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు తానా ప్రతినిధులతో సంప్రదిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని మృతురాలి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు బానోతు కృష్ణ, మైబిల్లి సాహెబ్, నారపాటి రమేష్, గూడా సంజీవరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

‘సుప్రజ మరణం అత్యంత బాధాకరం’