ఊరూరా కోటి వృక్షార్చన
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు సంబురంగా, సంతోషంగా మొక్కలు నాటే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమవంతుగా ఒక్కో మొక్కను నాటారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొక్కల పండుగ
- గ్రామగ్రామాన సందడి వాతావరణం
- హాజరైన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉభయ జిల్లాల కలెక్టర్లు
- భాగస్వాములైన ప్రజలు
- సింగరేణి కార్పొరేట్లో మొక్కలు నాటిన సింగరేణీయులు
‘మొక్క’వోని సంకల్పంతో అంతా ఒక్కటయ్యారు.. ప్రతి పట్టణం.. ప్రతి గ్రామాన్ని హరితవనాలుగా మార్చే క్రతువుకు కదిలారు.. ‘కోటి వృక్షార్చన’లో భాగస్వాములయ్యారు.. దీంతో శనివారం ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. టేకులపల్లిలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, మల్లవరంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, లక్ష్మీదేవిపల్లిలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కారేపల్లిలో ఎమ్మెల్యే రాములునాయక్ మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్

ఖమ్మం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు సంబురంగా, సంతోషంగా మొక్కలు నాటే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమవంతుగా ఒక్కో మొక్కను నాటారు. ఖమ్మంరూరల్ మండలం గుర్రాలపాడులో గ్రానైట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపీ గౌతమ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపల్లిలోని రామచంద్ర డిగ్రీ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. బోనకల్ మండలంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, వైరా పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మల్లంపాటి సీతరాములు, సత్తుపల్లి బెటాలియన్ క్యాంపులో జరిగిన హరితహారంలో ఎంపీపీ హాజరై మొక్కలు నాటారు.

కారేపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మొక్కలు నాటారు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రం ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హాజరై మొక్కలు నాటారు. కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్లు, మధిర పట్టణంలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత పాల్గొన్నారు. తల్లాడ మండలం మల్లవరంలో జరిగిన మొక్కలు నాటే పండుగకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. వీరితోపాటు ఆయా మండలాల అధ్యక్షుడు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

