మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు గురిచేసిన కేసులో నేరం రుజువు కావడంతో దోషికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ఖమ్మం మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి...
కారేపల్లి, నవంబర్ 05 : మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు గురిచేసిన కేసులో నేరం రుజువు కావడంతో దోషికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ఖమ్మం మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలతండాకు చెందిన భూక్యా లచ్చిరాం (42)పై 2019లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరారోపణలు రుజువైనట్లు నిర్ధారించింది.
దీంతో భూక్యా లచ్చిరాంను దోషిగా తేల్చుతూ మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా ఏఎస్ఐ బి.కృష్ణప్రసాద్, ప్రధాన దర్యాప్తు అధికారిగా పి. వెంకన్న సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ సీహెచ్.నాగేశ్వరరావు, ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన ఏపీపీ గాయత్రి, బ్రీఫింగ్ ఆఫీసర్ ఎస్ఐ పి.గోపి, లైజన్ అధికారి ఎస్ఐ కె.శ్రీకాంత్‌ను అడిషనల్ డీసీపీ రామానుజం ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

