పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా..
పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
- పార్టీలకు అతీతంగా పథకాల లబ్ధి చేకూరుస్తా..
- ఖమ్మం రూరల్ పర్యటనలో మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, మే 19: పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత రెడ్డిపల్లిలోని మారెమ్మతల్లి దేవాలయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామస్తులతో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హోల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల గురించి గ్రామపెద్దలు, ముఖ్య నాయకులను అడిగి తెలుసుకున్నారు. తరువాత పద్మశ్రీ వనజీవి రామయ్యతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పోలేపల్లి, పల్లెగూడెం, గోళ్లపాడు, తీర్థాల, పొలిశెట్టిగూడెం, మంగలిగూడెం, తనగంపాడు, గూడూరుపాడు, ఎం.వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం, ఆరెకోడుతండా, ఆరెకోడు, చింతపల్లి, ఆరెంపుల గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ, ప్రతి వ్యక్తికీ సంక్షేమ పథకాలు అందజేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అనేక దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

