‘బీఆర్ఎస్’తోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.
- అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలు
- వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలందరూ అండగా ఉండాలి
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. మండలంలోని 40 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఇలాంటి బృహత్తర పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
ఇలంటి అద్భుత పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాజారావు, వివేక్‌రామ్, సునీల్‌శర్మ, వెంకటేశ్వర్లు, శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, సిరిపురం స్వప్న, కొర్సా లక్ష్మి, భూక్యా శ్రావణి, భూక్యా భారతి, కామిరెడ్డి రామకొండారెడ్డి, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, జక్కం సుబ్రహ్మణ్యం, ఎక్కంటి శ్రీనివాసరెడ్డి, సోమయ్య, చేతుల పెద్దవీర్రాజు, గోనెల నాని, బండారు లక్ష్మీనారాయణ, కురుకుంట్ల చిన్నపరెడ్డి, ఆవుల మహేశ్‌రెడ్డి, ఖగేందర్రెడ్డి, కొనకంచి శ్రీను, సాదిక్‌పాషా, ఖాదర్, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలి
బీఆర్ఎస్ విజయం కోసం సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి గడపగడపకూ తెలిసేలా సోషల్ మీడియా ప్రచారం సాగాలన్నారు. యాంపాటి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU Professor Jobs | 30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు.. జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!?
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
Horoscope | 16-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

