పకడ్బందీగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్వోలకు ఓట్ల లెకింపుపై శిక్షణ నిర్వహించారు.
- రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన
నీలగిరి, జూన్ 1 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్వోలకు ఓట్ల లెకింపుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెకింపు మొదటి రౌండ్ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్‌ల సీల్ తీయాలని, అవసరమైన మెటీరియల్ అన్నింటినీ వారి ఎదుటే నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు ఇంకు పెన్నులు, వాటర్ బాటిళ్లు, సెల్ ఫోన్ వంటివి తీసుకురావడానికి వీలులేదని చెప్పారు. నల్లగొండలోని దుప్పలపల్లి గోదాములోని 4 హాళ్లలో ఓట్ల లెకింపు చేపడుతామని, ఇందుకోసం 96 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒకో హాల్లో 24 టేబుళ్లు ఉంటాయని చెప్పారు. ఉదయం 6 గంటలకు ఓట్ల లెకింపు సిబ్బంది కేంద్రం వద్ద హాజరుకావాలని, ఉదయం 8 గంటలకు ఓట్ల లెకింపు ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి హాల్‌కు అదనపు కలెక్టర్, ఒక ఏఆర్వో ఇంఛార్జిగా ఉంటారని, ఆర్టీవో స్థాయి అధికారులు ఇద్దరు ఉంటారని, 12 టేబుళ్లకు ఒక ఆర్డీవో ఇంఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చామని, మరోసారి 3వ తేదీన శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. మొదటి రౌండ్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నవారు, రెండో షిఫ్ట్ ఉద్యోగులు వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టేబులేషన్, ఓట్ల లెకింపు, రిపోర్టులు, మొదటి రౌండు కౌంటింగ్ అంశాలపై మాట్లాడారు. ఓట్ల లెకింపులో తేడా రాకుండా చూసుకోవాలన్నారు. మూడు రౌండ్ల వరకు పూర్తిస్థాయిలో బండిల్స్ లెకిస్తారని, నాలుగో రౌండ్ సైతం ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అన్నింటినీ కలుపుకొని బ్యాలెట్ పేపర్ లెకించాల్సి ఉంటుందని, చెల్లుబాటు ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి లెకించాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఏఆర్వోలు పాల్గొన్నారు.
ఓట్ల లెకింపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి..
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన కోరారు. కలెక్టరేట్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మొత్తం 96 టేబుళ్లలో ఓట్ల లెకింపు ఉంటుందని, ఒకో టేబుల్‌కు ఒక ఏజెంటును అభ్యర్థులు నియమించుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ లేదా అభ్యర్థి ఉండవచ్చని తెలిపారు. ఈ నెల 2వ తేదీలోపు ఏజెంట్ల పేర్లు, ఫొటోలు ఇచ్చి ఐడెంటిటీ కార్డులను తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 5న ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గర హాజరుకావాలని తెలిపారు. ఎన్నికల ఏజెంట్లు పెన్సిళ్లు, జెండాలు, పార్టీ గుర్తుల వంటివి ధరించి కౌంటింగ్ కేంద్రంలోకి రాకూడదన్నారు. ఏజెంట్లకు పెన్నులు, పేపర్లను కౌంటింగ్ హాల్లో ఇస్తారని తెలిపారు. అదనపు కలెక్టర్లను కౌంటింగ్ హాళ్లకు ఇంఛార్జి అధికారులుగా నియమించామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్వోలు నల్లగొండ దుప్పలపల్లి గోదాము వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

