కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
కారేపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధీనంలో ప్రతి ఆదివారం నిర్వహించే పశువుల సంత లైసెన్సు హక్కుల కోసం గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. సంత ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో..
– రూ.8.06 లక్షలకు దక్కించుకున్న నార్కెట్పల్లి వాసి దూదిమెట్ల వెంకటేశ్వర్లు
కారేపల్లి, నవంబర్ 05 : కారేపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధీనంలో ప్రతి ఆదివారం నిర్వహించే పశువుల సంత లైసెన్సు హక్కుల కోసం గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. సంత ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో వేలం ప్రక్రియను చేపట్టారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆరుగురు వ్యక్తులు నిర్ణీత డిపాజిట్ మొత్తాన్ని చెల్లించి పోటీలో నిలిచారు. వేలం పాటలో పాల్గొన్న వారు పోటాపోటీగా ధరలను పెంచుతూ వేలం నిర్వహించగా నార్కెట్పల్లికి చెందిన దూదిమెట్ల వెంకటేశ్వర్లు అత్యధికంగా రూ.8 లక్షల 6 వేలకు వేలం పాట పాడి పశువుల సంత నిర్వహణ హక్కులను దక్కించుకున్నాడు.
కారేపల్లి మండల కేంద్రంలో ప్రతి ఆదివారం జరిగే పశువుల సంతకు పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి రైతులు, పశువుల కొనుగోలుదారులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో సంత నిర్వహణ లైసెన్సు వేలం ఆసక్తికరంగా సాగింది. దేవస్థానానికి ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి కొండకింది వేణుగోపాల చారి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత, గ్రామ పంచాయతీ సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ), పంచాయతీ కార్యదర్శి నెహ్రూ, దేవాలయ అర్చకుడు దంతోజు వినయ్, దేవస్థాన సిబ్బంది మూడు మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
Midday meal | నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట వివాదం
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

