కొత్తగూడెం గణేష్ టెంపుల్, అక్టోబర్ 06 : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు కీలకమని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కొత్తగూడెం నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. ఖమ్మం- వరంగల్- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత విద్యావంతుల ఓటు నమోదులో కీలకంగా వ్యవహరించాలన్నారు . నియోజకవర్గంలో ఉన్న 14వేల ఫై చిలకు ఓట్లను బిఆర్ఎస్ పార్టీకి వేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మోసపూరితమైన హామీలకు తలొగ్గకుండా ప్రజా సమస్యలపై పోరాడే విద్యావంతున్నే ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి ప్రసంగించగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజు గౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, అన్వర్ పాష, అనుదీప్, కార్పోరేటర్లు సాగర్ మల్హోత్రా, గుణ చరిత్, రాంబాబు పాల్గొన్నారు.