దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశారు.