పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై ఓ అధికారి కన్నుపడింది. ప్రజాప్రతినిధులు, కార్యదర్శుల నిబంధనల ప్రకారం చేసిన పనులకు సైతం పర్సంటేజీ ముట్టచెప్పందే బిల్లులు క్లియర్ కావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూర్గంపహాడ్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి తీరు...
బూర్గంపహాడ్, అక్టోబర్ 15 : గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై ఓ అధికారి కన్నుపడింది. ప్రజాప్రతినిధులు, కార్యదర్శుల నిబంధనల ప్రకారం చేసిన పనులకు సైతం పర్సంటేజీ ముట్టచెప్పందే బిల్లులు క్లియర్ కావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూర్గంపహాడ్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి తీరు ఈ వ్యవహారంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో సదరు అధికారి తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం మండలంలో ఓ పంచాయతీకి సంబంధించి నిధుల లావాదేవీలు, బిల్లుల క్లియరెన్సన్కు ఫైల్ వెళ్లగా ముడుపులు అందిన తర్వాతే ముందుకు కదులుతామన్న రీతిలో సదరు అధికారి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినవస్తున్నాయి. నా వాటా నాకు చేరితేనే సంతకం పెడతా… లేదంటే అభ్యంతరాల పేరుతో ఫైల్ పెండింగ్ లో పెడతా మంటూ నేరుగా చెబుతున్నట్లు పంచాయతీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆ అధికారి గతంలో పని చేసిన ప్రదేశంలో ఇదే తీరుతో ఉన్నారని, పంచాయతీ కార్యదర్శులను మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర ఉందనే ఆరోపణలూ లేకపోలేదు. బిల్లుల విషయంలో కార్యదర్శులనే కాకుండా సర్పంచులు, ఉప సర్పంచులను సైతం ఇబ్బందులపాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సంబంధిత కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి స్పందించి సదరు అధికారి వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవోను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా అభివృద్ధి పనుల విషయంలో సదరు అధికారి బిల్లుల చెల్లింపులో పర్సంటేజీ తీసుకుంటున్నట్లు పలు పంచాయతీల్లోని సర్పంచుల నుండి తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వివరణ ఇచ్చారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

