వైకుంఠధామంలో బస చేస్తున్న కొవిడ్ రోగులు ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు

కొత్తగూడెం : కొవిడ్‌కు గురైన రోగులు వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్‌లో ఉండగా అధికారులు వీరిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన కుగ్రామమైన మోద్దులమడలో చోటుచేసుకుంది. గ్రామంలో 150 మంది నివాసులు ఉండగా వీరిలో మహిళలు, పురుషులు కలిపి దాదాపు 50 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరంతా గ్రామంలోని వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని అక్కడే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కాగా వీరిలో 10 మంది రోగులను రెండు రోజులక్రితమే సున్నంబస్తీ గ్రామంలోని ఆశ్రమం పాఠశాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు అశ్వారావుపేట తహసీల్దార్ సీహెచ్ ప్రసాద రావు తెలిపారు. మిగతా వారు నిరాకరించినట్లు చెప్పారు. పలుమార్ల విజ్ఞప్తి అనంతరం మిగతా వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించామన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

