కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం
సింగరేణి కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆతిథ్యంలో కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు శుక్రవారం రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్వహిస్తున్న ఈ పోటీలు రెండు రోజుల పాటు...
క్రీడాకారులు గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలి
– కొత్తగూడెం ఏరియా జీఎం వెంకటరమణ
రుద్రంపూర్, అక్టోబర్ 30 : సింగరేణి కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆతిథ్యంలో కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు శుక్రవారం రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్వహిస్తున్న ఈ పోటీలు రెండు రోజుల పాటు (అక్టోబర్ 30, 31) కొనసాగనున్నాయి. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ, గౌరవ అతిథులుగా జీఎం (పర్సనల్) జీవీ కిరణ్ కుమార్, ఏజీఎం మురళీధర్ రావు, జీఎం (పర్సనల్) కె. అజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ స్నేహభావం, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా చెస్ మేధస్సుకు పదును పెట్టే ఆట అని, ప్రత్యర్థి ఎత్తుగడలను ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆడినవారే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా క్రీడాకారులు ప్రాంతీయ, కంపెనీ స్థాయి, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అధిక సంఖ్యలో బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం ఎం. గోవిందరావు, ఎల్. తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శులు జె. గట్టయ్య, ఎస్.సుధాకర్, ఐఎన్టీయూసీ నాయకులు ఎం.డి.రజాక్, కోటేశ్వరరావుతో పాటు నలుగురు స్పోర్ట్స్ సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోటీల్లో ఆరు జట్లకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్జీ-1, 2; ఆర్జీ-3, బీహెచ్పీఎల్; బీపీఏ, ఎంఎం; ఎస్ఆర్పీ; వైఎల్డీ, ఎంఎన్జీ; కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా జట్లు పోటీపడుతున్నాయి. స్పోర్ట్స్ సూపర్వైజర్లు, పర్సనల్, ఎస్అండ్పీసీ, ఈఅండ్ఎం, సివిల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

