గ్రూప్-1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు,
- – ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, జూన్ 5 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి పరిష్కరించాలని సూచించారు. సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 18,403 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు.
పరీక్షలకు ఒకరోజు ముందే రూట్ అధికారులు, పరీక్షాకేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, పోలీస్ అధికారులతో కలిసి ప్రశ్నాపత్రాల తరలింపు రూట్‌ను పరిశీలించాలన్నారు. ఓఎంఆర్ షీట్‌పై ముందుగానే అభ్యర్థుల వివరాలు ప్రింట్ చేసి వస్తాయని, వాటిని సంబంధిత అభ్యర్థులకు అందేలా చూడాలన్నారు. ప్రతిఒక్కరిని పూర్తిస్థాయిలో చెక్ చేయాలన్నారు. అభ్యర్థులు ఉదయం 9గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 10గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతి ఇవ్వరన్నారు. పరీక్షల నిర్వహణకు 13 ఫ్లయింగ్ స్కాడ్స్, 52 మంది శాఖాధికారులు, 184 మంది గుర్తింపు అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీటింగ్ ఏర్పాట్లతోపాటు ఇన్విజిలేటర్ల రూంల కేటాయింపు అదేరోజు ఉంటుందన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలతో పకడ్బందీ భద్రతతో పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ సమన్వయకర్తలు డాక్టర్ జాన్‌బాబు, డాక్టర్ రాజ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో అరుణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

