బాలల మేధోప్రంచం సైన్స ఫెయిర్
బాల శాస్త్రవేత్తలు సృష్టించిన మరో ప్రపంచం ఇన్స్పైర్ సైన్స్‌ఫెయిర్. సెయింట్ జోసఫ్ హై స్కూల్ వేదికగా జరుగుతున్న సైన్స్‌ఫెయిర్ రెండో రోజు బుధవారం అద్భుతంగా సాగింది. ఖమ్మం, మధిర డివిజన్ల నుంచి 583 ప్రాజెక్ట్‌లు ప్రదర్శనకు వచ్చాయి.
- రెండోరోజూ కొనసాగిన ప్రదర్శన
- జిల్లావ్యాప్తంగా 583 ప్రదర్శనలు
- 10 వేల మంది విద్యార్థుల వీక్షణ
- నేడు ముగింపు వేడుక
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 14: బాల శాస్త్రవేత్తలు సృష్టించిన మరో ప్రపంచం ఇన్స్పైర్ సైన్స్‌ఫెయిర్. సెయింట్ జోసఫ్ హై స్కూల్ వేదికగా జరుగుతున్న సైన్స్‌ఫెయిర్ రెండో రోజు బుధవారం అద్భుతంగా సాగింది. ఖమ్మం, మధిర డివిజన్ల నుంచి 583 ప్రాజెక్ట్‌లు ప్రదర్శనకు వచ్చాయి. ప్రాజెక్ట్‌లను వీక్షించేందుకు జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులు విచ్చేశారు. 15 కమిటీలు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించారు. జూనియర్ కళాశాలల నుంచి వచ్చిన 15 మంది న్యాయనిర్ణేతలు ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఇన్చార్జి డీఈవో సామినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో 15 కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులు సైన్స్‌ఫెయిర్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భోజన కమిటీ, క్రమశిక్షణ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, న్యాయనిర్ణేతల కమిటీ, సాంస్కృతిక విభాగం, విద్యుత్, డాక్యుమెంటేషన్ కమిటీలు విశిష్ట సేవలందించాయి. విద్యార్థులు వేచి ఉండటానికి టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాయి. సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించాయి. న్యాయ నిర్ణేతల కమిటీ ఒక్కో ప్రాజెక్ట్‌ను క్షుణ్ణంగా పరీశీలించింది.
ప్రైవేట్ యాజమాన్యాల ప్రత్యేక శ్రద్ధ..
సైన్స్ ఫెయిర్ నిర్వహణపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాయి. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులు, గైడ్ టీచర్లు, అతిథులకు కావాల్సిన వసతులను ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కల్పించింది. మూడు రోజుల పాటు 2 వేల మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించింది. సూరపనేని శేషుకుమార్ మెమోరియల్ ట్రస్ట్ రాత్రి భోజనం సమకూర్చింది. వసతులను ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొగ్గారపు రామచందర్‌రావు, గీతాంజలి అప్పారావు, శ్రీవిద్యానికేతన్ గొల్లపూడి రామ్‌ప్రసాద్, అభినవ్ రమణ, టైనిటాట్స్ భాస్కర్, విన్ఫీల్డ్ పోలవరపు శ్రీకాంత్, ఆర్వీఎస్ యాదవ్, కేరళ సంపత్, తెలంగాణ నారాయణ సందీప్ పర్యవేక్షించారు.
విద్యార్థులతో సెమినార్
నిర్వాహకులు బుధవారం ‘విజ్ఞానశాస్త్రం- సుస్థిరభివృద్ధి’ అనే అంశంపై విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానంలో నిలిచిన విద్యార్థులను బహుమతులకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బొల్లికొండ సైదులు, ఏఎంవో రవికుమార్, అర్బన్ ఎంఈవో ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ గురువారంతో ముగియనున్నది. ముగింపు సమావేశంలో అతిథులు ఉత్తమ ప్రాజెక్ట్‌లు ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారని ఇన్చార్జి డీఈవో సత్యనారాయణ తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

