Raghuveer Singh | ఆధ్యాత్మిక కేంద్రాలైన ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందించాలి.. రఘువీర్‌సింగ్
జూలపల్లి, ఫిబ్రవరి 17 : ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు.
Raghuveer Singh | జూలపల్లి, ఫిబ్రవరి 17 : ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శ్రీ రావుల మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్, నేనున్నా స్వచ్ఛంద సేవా సమితి తరఫున రూ.50 వేల చెక్కును యాదవ సంఘం సభ్యులకు అందజేశారు.
ఈ క్రమంలో యాదవ కులస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వీసారపు వెంకటేశం, మాజీ వైస్ ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచులు సూర ప్రభుదాస్, మెండె తిరుపతి, మాజీ ఎంపీటీసీ తమ్మడవేణి మల్లేశం, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కొండపల్లి కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంకెండ్ల లక్ష్మణ్, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు పొట్టాల మల్లేశం, యాదవ సంఘం అధ్యక్షుడు ఆవుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

