Godavarikhani | ‘జనగామ’ను వీడని భయం.. గంట గంటకు భూమి లోపలికి కుంగుతున్న బోరు
రామగుండం నగర పాలక సంస్థ 6వ డివిజన్ జనగామ గ్రామంలో ముంపు జాడలపై ఆందోళనకర వాతావరణం నెలకొంది. గ్రామంలోని యాదవ నగర్లో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా భూమిలోకి బోరు (చేతి పంపు) కుంగిపోవడంతో గ్రామం ఉలిక్కిపడింది.
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన మేయర్, సింగరేణి జీఎంలు
- ముంపు జాడలపై గ్రామస్థుల ఆందోళన
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 24 : రామగుండం నగర పాలక సంస్థ 6వ డివిజన్ జనగామ గ్రామంలో ముంపు జాడలపై ఆందోళనకర వాతావరణం నెలకొంది. గ్రామంలోని యాదవ నగర్లో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా భూమిలోకి బోరు (చేతి పంపు) కుంగిపోవడంతో గ్రామం ఉలిక్కిపడింది. ఆ భయంతో రాత్రంతా గ్రామస్థులు జాగారం చేయాల్సి వచ్చింది. గ్రామం కిందుగా బొగ్గు గని ఉండటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, మున్సిపల్, జియోలాజికల్ విభాగం అధికారులతో శనివారం చేరుకొని ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బోరు కుంగిపోవడానికి గల కారణాలను అన్వేషించారు. బొగ్గు గనుల తవ్వకాల వల్ల తమ గ్రామం బొందలగడ్డగా మారుతోందని గ్రామస్తులు ఆగ్రహించారు. భూగర్భ జలాలు క్షీణించిపోవడంతో తరచుగా భూమి కుంగడంతో ఇళ్లు బీటలు వారి ఎప్పుడు కూలిపోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకొన్న సింగరేణి గ్రామంను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.
సింగరేణి సంస్థ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా నిలిపివేయడంతో బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు. అనంతరం మేయర్, జీఎంలు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సింగరేణి అధికారులతో ఈ ప్రాంతంను సందర్శించామని మేయర్ తెలిపారు. కుంగిపోయిన విషయంలో సాంకేతిక నిపుణులచే విచారణ చేసి నిర్ధారించిన అనంతరం భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ఒకటో గని గ్రామం కింద ఉండటం వల్ల స్టవింగ్ లోపంతో ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. జియాలజికల్, ఎన్విరాన్మెంటల్ నిపుణలతో సర్వే చేసి కుంగుబాటు ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని అనేక సమస్యలపై గ్రామస్థులు ఏకరువు పెట్టారు. జీఎం లలిత్ కుమార్ సానుకూలంగా స్పందించి నిపుణుల బృందంతో పరిశీలన జరుపుతామని ఎవరూ భయపడొద్దని సూచించారు. ఇటీవల కాలంగా గ్రామంలో ముంపు జాడలు చోటు చేసుకోవడం భయంగా ఉందనీ, రేపు ఇళ్లు కూడా కుంగిపోతే బాధ్యులెవరంటూ కార్పొరేటర్ శ్యామణి రమేష్ తో పాటు జువ్వాడి విజయ్ రావు , గ్రామస్థులు అధికారులను నిలదీశారు. సాయంత్రం పది మంది గ్రామ పెద్దలు వస్తే మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని జరగాల్సిన దానిపై చర్చిద్దామని తాపీగా ఉచిత సలహా ఇచ్చి వెళ్లిపోవడటం పట్ల మరింత మండిపడ్డారు. అనంతరం కుంగిన బోరు వద్ద మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించగా, గంట గంటకు మరింతగా భూమిలోకి కుంగిపోతుండటం, లోపల రెండు మీటర్ల బిలము ఏర్పడటంతో గ్రామస్థులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వచ్చారు..చూసి వెళ్లిపోయారనీ, పైగా పెద్దగా ప్రమాదమేమి లేదని చెబుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటీవలనే అనివాష్ అనే వ్యక్తి ఇంటి వద్ద బోరు వేయగా, రెండు మోటార్లు భూమిలోపల గల్లంతయ్యాయని గుర్తు చేశారు. తాజా ఘటనతో జనగామలో భయానక వాతావరణం వీడటం లేదు.
జనగామను కాపాడండి : తోకల శ్యామణి రమేష్, బీఆర్ఎస్ కార్పొరేటర్, జనగామ
సింగరేణి బొగ్గు పుట్టిన ఊరు జనగామను ప్రభావిత గ్రామంగా గుర్తించి ఇకనైనా గ్రామస్థుల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవాలి. గ్రామం ముంపునకు గురి గాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. గ్రామ స్వాగత బోర్డు నుంచి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించాలి. ముఖ్యంగా భూమి కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను త్వరగా చేపట్టాలి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

