Koppula Eshwar | గోదావరిఖనిలో అభివృద్ధి ఫైలాన్ కూల్చివేత అత్యంత దుర్మార్గం.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తొత్తులుగా మారడం సిగ్గుచేటు
- అరెస్టు చేసిన కోరుకంటి చందర్, వ్యాల్ల హరీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలి
Koppula Eshwar | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామగుండం ప్రాంతంలో చేపట్టిన అపూర్వ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన అభివృద్ధి ఫైలాన్ ను మున్సిపల్ అధికారులు దొంగచాటుగా తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రామగుండంలో ఐటీ పార్క్, మౌలిక వసతులు, తాగునీటి పథకాలు సహా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల జ్ఞాపకార్థం గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ పైలాన్‌ను నిర్మించాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఈ అక్రమ కూల్చివేతకు పాల్పడ్డారు.
మున్సిపల్ అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే ఏది చెబితే అది చేయడమే అధికారుల పనా? అని నిలదీశారు. రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు కొత్తేమీ కాదని, గత కొన్ని నెలలుగా చివరకు దేవాలయాలను కూడా వదలకుండా కూల్చివేస్తున్నారని గుర్తు చేశారు. కట్టడాలను కూల్చివేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బీఆర్ఎస్ అభివృద్ధిని, కేసీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయడం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
రామగుండం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్ల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, అధికారుల అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని హెచ్చరించారు.అక్రమ కూల్చివేతను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అక్రమంగా రెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి నాయకులను అరెస్టు చేసిన మూల విజయ రెడ్డి, కౌశిక్ హరి మురళీధర్ రావు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

