Bhimeshvara Temple | భీమేశ్వరాలయం జిల్లా అధికారికి చుక్కెదురు..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కొలువుదీరి ఉండగా జిల్లాలో పనిచేస్తున్న జిల్లా స్థాయి అధికారుల అందరికీ స్వామివారి దర్శనానికి సంబంధించిన సిఫార్సులు ఉండి ఉంటాయి.
- స్వామి వారి దర్శనంలో సహ సిబ్బంది చేతివాటం
- బంధుమిత్రుల వద్ద బంగపాటు
Bhimeshvara Temple | వేములవాడ, నవంబర్ 28 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కొలువుదీరి ఉండగా జిల్లాలో పనిచేస్తున్న జిల్లా స్థాయి అధికారుల అందరికీ స్వామివారి దర్శనానికి సంబంధించిన సిఫార్సులు ఉండి ఉంటాయి. అయితే ఇందులో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, అటవీ శాఖ, ఎక్సైజ్ ఇలా అనేక రకాల విభాగాల నుండి ఒక ఉద్యోగి రాజన్న దర్శనాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సాధారణంగా దర్శనానికి వచ్చే స్థాయిని బట్టి అధికారులు నేరుగా వచ్చి స్వామివారి దర్శనాలు చేయిస్తారు. వారికి సంబంధించిన ఇతర బంధువులు, మిత్రులు వచ్చినప్పుడు సిబ్బందికి దర్శనం బాధ్యతలు అప్పగిస్తుంటారు. అసలే కార్తీకమాసం కావడంతో భక్తుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగా ఉండగా దర్శనాల తాకిడి కూడా అధికంగానే ఉంది. ఇటీవలే ఓ విభాగానికి చెందిన అధికారికి సంబంధించిన బంధువులు స్వామివారి దర్శనానికి రాగా వారికి దర్శనం చేయించడంలో అక్కడ ప్రోటోకాల్ విభాగంలో పనిచేస్తున్న శాఖ ఉద్యోగి నిర్లక్ష్యం చేశాడు. దర్శనానికి వచ్చిన సదరు అధికారుల బంధువులకు జరిగిన తీరును వివరించగా జిల్లా స్థాయి అధికారి వద్దకు వ్యవహారం చేరింది.
దర్శనాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించని సదర్ జిల్లా అధికారి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని వేరే మండలానికి అటాచ్డ్ చేశారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం స్వయంగా జిల్లా అధికారికి చెందిన సమీప స్నేహితులు స్వామివారి దర్శనానికి రాగా అందుబాటులోని అధికారి ద్వారా సమాచారం జారవేశారు. అయితే ఆ అధికారి కింద స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వగా దర్శనం బాగానే చేయించినప్పటికీ చేతివాటాన్ని ప్రదర్శించిన తీరు వచ్చిన అధికారి సమీప బంధు మిత్రులు కంగు తిన్నారు. జిల్లాలో పెద్ద స్థాయిలో ఉన్న అధికారి అయి ఉండి దర్శనానికి డబ్బులు అడిగిన తీరు యధావిధిగా జిల్లా స్థాయి అధికారికి వివరించారు. దీంతో సదరు అధికారి శనివారం సంబంధిత శాఖపరమైన అధికారులు, సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దర్శనం సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితోపాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా నిర్ధారణకు రాగా సంబంధిత శాఖతోనే విచారణ జరిపినట్లు తెలిసింది. ఏది ఏమైనా జిల్లాలో పటిష్టవంతమైన శాఖగా పేరు ఉన్న సంబంధిత శాఖ ఉన్నతాధికారికే చుక్క ఎదురైన తీరు ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

