పూల సింగిడి
‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది.. జిల్లా ‘పూల సింగిడి’ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.
- సంబురంగా ఆడిపాడిన ఆడబిడ్డలు
- ఊరూరా గౌరమ్మకు ఘనవీడ్కోలు
- కరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల
- తిమ్మాపూర్‌లో హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది.. జిల్లా ‘పూల సింగిడి’ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ మహిళలు పాటలతో హోరెత్తించగా వాడవాడలా మార్మోగింది.. అనంతరం డ్యాంతోపాటు చెరువులు, కుంటలు, కాలువలు, ఘాట్ల వద్ద నిమజ్జనం చేసి, ‘పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికింది.. ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకుని, సంబురంగా ఇంటి దారి పట్టడంతో వేడుక ముగిసింది.

– కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 22
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 22: సద్దుల సంబురాలు ఆదివారం జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హోరెత్తించారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు పలుచోట్ల వందలాది మంది ఒక్కచోట చేరి ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాలువలతోపాటు ఏర్పాటు చేసిన తెప్పల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు.

ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ‘కొత్తసిబ్బి.. పాత సిబ్బి’ అంటూ సత్తులు పంచుకొని తిన్నారు. కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్, రాంనగర్‌లోని రమా సహిత సత్యనారాయణ ఆలయం, గణేశ్‌నగర్, మానేరు ఒడ్డున ఉన్న బతుకమ్మ పాయింట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంకలో జరిగిన వేడుకల్లో మండలి విప్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో బతుకమ్మను పేర్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

