Godavarikhani | ప్రొటోకాల్ విస్మరించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్కు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఫిర్యాదు
6వ డివిజన్ పరిధి జనగామ గ్రామంలో దళిత మహిళా కార్పొరేటర్ కు అవమానం చోటుచేసుకుందని, తరచుగా ఉద్దేశపూర్వకంగా ప్రొటోకాల్ విస్మరించి ప్రతిపక్ష కార్పొరేటర్లను అవమానిస్తున్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, బాధిత కార్పొరేటర్ తోకల శ్యామణి రమేష్ పెద్దపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 16 : 6వ డివిజన్ పరిధి జనగామ గ్రామంలో దళిత మహిళా కార్పొరేటర్ కు అవమానం చోటుచేసుకుందని, తరచుగా ఉద్దేశపూర్వకంగా ప్రొటోకాల్ విస్మరించి ప్రతిపక్ష కార్పొరేటర్లను అవమానిస్తున్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, బాధిత కార్పొరేటర్ తోకల శ్యామణి రమేష్ పెద్దపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14న గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను నగర పాలక మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించిన సందర్భంగా ఆ డివిజన్ ప్రథమ పౌరురాలిగా, గ్రామస్థులతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన దళిత మహిళా కార్పొరేటర్ ఆవుల శ్యామనిని ఆహ్వానించకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది మొదటి అవమానం కాదనీ, జనగామ డివిజన్ లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించినా వ్యవసాయ అధికారులు కావాలనే కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా తరచుగా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. నగర పాలక ఎన్నికల్లో రాజ్యాంగ బద్ధంగా గెలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్ల పట్ల అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనీ, గతంలో సైతం ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసిన సంఘటనను గుర్తు చేశారు. జనగామ మహిళా కార్పొరేటర్ కు జరిగిన అవమానంపై తక్షణమే స్పందించి అధికారులపై తక్షణ చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ, అలాగే జిల్లాలో దళిత ప్రజాప్రతినిధులపై వివక్షతను అరికట్టే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Foods In Fridge | ఆహారాలను ఫ్రిజ్లో ఉంచి పదే పదే వేడి చేసి తింటున్నారా.. ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..?
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

