Godavarikhani | ప్రకటనల బోర్డులపై రామగుండం బల్దియా కొరడా.. నిర్వాహకులకు రూ.50వేల జరిమానా
గోదావరిఖని నగరంలోని కేంద్రీకృత విద్యుత్ దీపాల స్తంభాలకు అనధికారికంగా ప్రకటనల బోర్డులు తగిలించిన అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీల నిర్వాహకులపై రామగుండం బల్దియా కొరడా ఝుళిపించింది. ఈమేరకు మంగళవారం నిర్వాహకులకు రూ.50వేల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 27 : గోదావరిఖని నగరంలోని కేంద్రీకృత విద్యుత్ దీపాల స్తంభాలకు అనధికారికంగా ప్రకటనల బోర్డులు తగిలించిన అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీల నిర్వాహకులపై రామగుండం బల్దియా కొరడా ఝుళిపించింది. ఈమేరకు మంగళవారం నిర్వాహకులకు రూ.50వేల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు తగిలించడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతోపాటు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండటంతో గతంలో హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు కూడా అందజేసినట్లు తెలిపింది. ఐనప్పటికీ నిర్వాహకులు పట్టించుకోక ప్రకటనల బోర్డులు తొలగించక యథావిధిగా ఉంచడంతో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మంగళవారం చర్యలకు ఉపక్రమించారు.
విధించిన జరిమానా చెల్లించకపోయినా, స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టడం పునరావృతమైనా సామగ్రి స్వాధీన పర్చుకోవడంతోపాటు చట్ట ఉల్లంఘనల చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసుల ద్వారా హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఈ చర్యలను స్వాగతిస్తున్నామని, కానీ నగరంలో రోజుల తరబడి ఉంటున్న రాజకీయ పార్టీ ఫ్లెక్సీల విషయంలో కూడా ఇదే వైఖరి అవలంబిస్తే బాగుంటుందని హితవు పలికారు. రాజకీయ పార్టీ ఫ్లెక్సీలకు ఈ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. తాను ఇటీవలనే రామగుండం నగర పాలక కార్యాలయం లో అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించాలని వినతి పత్రం అందజేస్తే మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

