Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపలు, తాబేళ్లు పట్టేందుకు స్నేహితులతో కలిసి చెరువులోకి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
Rajanna Sircilla | ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపలు, తాబేళ్లు పట్టేందుకు స్నేహితులతో కలిసి చెరువులోకి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న యువకుడు మృతి చెందడంతో భార్య, ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వెంకటాపూర్ గ్రామానికి చెందిన మోతే ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతుల కుమారుడు మోతే కిరణ్ స్నేహితులతో కలిసి చేపలు, తాబేళ్లు పట్టేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయాడు. కిరణ్ ఆచూకీ కోసం శుక్రవారం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం అతడి మృతదేహాన్ని వెలికితీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిరణ్‌కు భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడు మృతి చెందడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

