అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందే : బొల్గం నాగరాజు గౌడ్
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందేనని మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు బొల్గం నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు.
సిరిసిల్ల టౌన్, నవంబర్ 18 : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందేనని మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు బొల్గం నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక పదో వార్డులోని వార్డు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తమ వార్డు పరిధిలో 39 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా అర్హత జాబితాలో అందరి పేర్లు వచ్చాయని తెలిపారు. తీరా ప్రోసిడింగ్ కాపీలు ఇచ్చే సమయానికి వీరిలో నుండి 12 మంది పేర్లను రిజెక్ట్ చేశారని చెప్పారు. ఇదేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించగా పొంతన లేడి సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు , వితంతువులు, దివ్యాంగులు సంబంధిత అర్హత ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ వారికి పింఛన్ ఇవ్వకుండా నిలిపివేయడం బాధాకరమన్నారు. వార్డు పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం మంజూరు చేసిన 22 మంది సైతం ప్రొసీడింగ్ కాపీలు తీసుకోమని చెబుతున్నారని తెలిపారు. 39 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వని పక్షంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ బోల్గం వైష్ణవి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Yogi Adityanath: హ్యాట్రిక్‌తో రికార్డులు బద్దలు కొడుతాం: యూపీ సీఎం
‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా’.. పెంపుడు కుక్కకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
Tharun Bhascker | నా కొడుకుకి ఒకరున్నారనే ధైర్యం వచ్చింది.. తరుణ్-ఈషా రిలేషన్‌పై తల్లి గీతా భాస్కర్ భావోద్వేగం!
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

