Jeevan Reddy | మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప విత్తనాలకు బదులుగా చెరువుల విస్తీర్ణాన్ని పరిగణలకి తీసుకొని నగదు రూపేణా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Jeevan Reddy | రాయికల్, అక్టోబర్, 25 : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప విత్తనాలకు బదులుగా చెరువుల విస్తీర్ణాన్ని పరిగణలకి తీసుకొని నగదు రూపేణా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్ మండలంలోని కుమ్మరపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులను ఆయన ఆదివారం కలిశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు మత్స్యపారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు చెరువులలో చేప పిల్లలను ప్రభుత్వపరంగా ఉచితంగా రాయితీతో పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఇట్టి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సరైన సమయంలో చేయలేక పోతున్నారని మండిపడ్డారు. దీంతో మత్స్యకారులు ఆశించిన ఫలితాలు పొందలేకపోయారన్నారు.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ప్రభుత్వ పంపిణీ కోసం వేచిచూడకుండా సొంతంగా చేప పిల్లలను కొనుగోలు చేస్తున్నారని, దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఏలినో పరిస్థితులలో చెరువులలో నీరు త్వరితగతిన ఇంకి పోయే పరిస్థితి ఉందని వాపోయారు. కావున ప్రభుత్వం ఆ నిధులను చెరువుల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొంటు సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు నగదు రూపేణ పంపిణీ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

