పాలనను చూసే పార్టీకి ఆదరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యాల మండలం నమిలికొండ ఎంపీటీసీ మల్యాల సుజాతాశోభన్
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
కొడిమ్యాల, జూలై 4: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యాల మండలం నమిలికొండ ఎంపీటీసీ మల్యాల సుజాతాశోభన్ సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి సుంకె గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయకులు తెలంగాణపై కపట ప్రేమను కనబరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి వచ్చిన ప్రధానమంత్రి మోదీ ఇక్కడి ప్రజలకు చేసిన పనులెంటో చెప్పకుండా ప్రగల్బాలు పలికారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, ఏఎంసీ చైర్మన్ పొరండ్ల నరేందర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు మెన్నేని రాజనర్సింగరావు, పోలు రాజేందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, సర్పంచ్‌లు అనిత, తిరుపతి, నర్సయ్య, ఎంపీటీసీలు మల్లారెడ్డి, మిర్యా, సింధు, ఆర్బీఎస్ మండలం కోఆర్డినేటర్ అంకం రాజేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశం, నేరెళ్ల మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- development
- join
- people
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

