లేగదూడకు బారసాల

జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్‌కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో వేద పండితుడు అడిశెర్ల రామయ్య వేద మంత్రోచ్ఛరణల మధ్య లేగదూడకు బారసాల నిర్వహించారు. గణేశుడి మండపం వద్ద ఊయల కట్టి, లేగదూడను అందులో పడుకోబెట్టి పాటలు పడారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి పూజలు చేశారు. ఐదుగురు వ్యక్తులు లేగదూడకు నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి పెట్టారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

