పెద్దపల్లిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
Peddapalli | పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద 56 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద 56 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండలం ఈసలతక్కళ్లపల్లికి చెందిన బాలసాని మల్లేశం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బుగ్గా రామస్వామి టెంపుల్‌కు వెళ్లాడు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులను తిరిగి ఇంటికి పంపాడు. తనకు కొంచెం పని ఉంది. ఆ పని పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని మల్లేశం తన కుటుంబ సభ్యులకు చెప్పాడు.
రాత్రి అయినప్పటికీ మల్లేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు బసంత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్లేశం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతని ఆచూకీని కనుగొన్నారు. సోమవారం ఉదయం బసంత్ నగర్ రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి మల్లేశం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

