ఉమ్మడి జిల్లాలో పలువురు ఐఏఎస్లు, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియామకం కాగా, ఆమె స్థానంలో సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పని చేస్తున్న ముజమ్మిల్ఖాన్ రానున్నారు. వీరితో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ట్రాన్స్ఫర్ అయ్యారు.
– కలెక్టరేట్, జూలై 14
పెద్దపల్లి, జూలై 14(నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కలెక్టరేట్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు, ఆర్డీవోలు బదిలీ కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనూ పలువురు స్థాన చలనం పొందారు. పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియామకమవగా, ఆమె స్థానంలో సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ నియమితులయ్యారు. వీరితో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారి స్థానాలు, హోదాల వివరాలిలా ఉన్నాయి.