Peddapally | పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 17 : పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, నిట్టూరు, అందుగులపల్లి, గోపయ్యపల్లి , సబ్బితం తదితర గ్రామాల్లో మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా మండలంలోని రాఘవాపూర్, నిట్టూరు, గోపయ్యపల్లి, అందుగులపల్లి తదితర గ్రామాల్లో కేసిఆర్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.