Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 8 : రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచించారు. సమాజ హితంలో నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటివరకు క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సమష్టి సేవా కార్యక్రమాలకు భిన్నంగా గురువారం వ్యక్తిగత కార్యకలాపంకు శ్రీకారం చుట్టి శభాష్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం భద్రేశం, జోన్ చైర్ పర్సన్ తో పాటు పీఎస్టీలు, సీనియర్ లయన్స్ ప్రతినిధులు ఎవరికి వారుగా ఎక్కడికక్కడ పలువురికి తోచిన విధంగా చేయూత అందించారు.
రామగుండం మున్సిపల్ కార్మికులు, నిరాశ్రయ మహిళలు, వృద్ధులకు చీరలు, నిత్యవసర సరుకులు, నగదు రూపేణా సాయం అందజేశారు. క్లబ్ జోన్ చైర్మన్ తానిపర్తి విజయలక్ష్మీ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతీ ఒక్కరిలో సేవా స్ఫూర్తిని చాటాలని ఉద్దేశంతో వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. క్లబ్ సభ్యులు స్పందించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. తోటి వారికి సాయం అందించాలన్న సేవాగుణం ప్రతీ ఒక్కరిలో అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.