Collector Chitra Mishra | ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలి.. కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
- ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశం
- కొత్తపల్లి, ములకనూరు, చిగురు మామిడిలో రోడ్డు నిర్మాణం అలైన్మెంట్ పరిశీలన
Collector Chitra Mishra | కరీంనగర్, జూలై 17: కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, చిగురుమామిడి మండల కేంద్రం, ముల్కనూరు గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పర్యటించి ఫోర్‌లైన్ రహదారికి సంబంధించిన భూసర్వే, అలైన్మెంట్ పనులను పరిశీలించారు. ఫేజ్-1 కింద కొత్తపల్లి నుంచి సుందరగిరి వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్కడైనా నివాస గృహాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా, ప్రత్యామ్నాయంగా బైపాస్ మార్గాల ఏర్పాటు సాధ్యమా అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అవసరమైతే గ్రామసభలు నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రహదారి పనులు చేపట్టాలని, భూసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ప్రజల ఇళ్లకు, జీవన విధానానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ షర్మిల, తిమ్మాపూర్, చిగురుమామిడి తహసీల్దార్లు శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య, ఆర్అండ్బీ డీఈ కిరణ్, ఏఈ సురేష్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

