ముస్తాబాద్/గంభీరావుపేట/సిరిసిల్ల టౌన్, జూలై 23: యంగ్ డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల యువజన నాయకులు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గల ఆలయాల్లో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. రోగులకు పండ్లు అందించారు. ఇక్కడ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజిరెడ్డి, యువజన నాయకుడు మెంగాని మనోహర్, ఎంపీటీసీ కొండని బాలకిషన్, నాయకులు సర్వర్‌పాషా, ఎద్దండి నర్సింహారెడ్డి, ఆనంద్‌రావు, కొండ శ్రీనివాస్, సాయిలు, దేవేందర్, శీలం స్వామి, అన్వర్, విశ్వానాథం, నరేశ్, జవ్వాజి బాలకిషన్, బైతి నవీన్, రాజు. నర్సింహులు, శ్రీనివాస్, రం జిత్ భరత్, దేవేందర్ నర్సయ్య, బాలకృష్ణ, నందు, సాయిప్రసాద్, గణేశ్ తదితరులు ఉన్నారు.
సక్సెస్ ఇనిస్టిట్యూట్‌లో..
సక్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్ (కరీంనగర్) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రం లో మంత్రి కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక లహరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా వన్డే స్కిల్ సర్టిఫికెట్ కోర్సు, బ్యూటీ వెల్నెస్ ప్రోగ్రామ్‌ను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మహిళలకు ఆర్థిక ఉపాధిని కల్పించాలన్న లక్ష్యంతో వర్క్‌షాప్ నిర్వహించడం సంతోషకరమన్నారు. నిర్వాహకులు స్పప్నరావును అభినందించారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇక్కడ బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు బత్తుల వనజ, కౌన్సిలర్లు గడ్డం లత, దార్ల కీర్తన, ఆడెపు సౌజన్య, జాగిరి శైలు, తదితరులు ఉన్నారు.
అల్పాహారం పంపిణీ
గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 400మందికి మా జీ ఎంపీటీసీ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి అల్పాహారం అందించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఉపసర్పంచ్ నాగరాజుగౌడ్, నాయకులు కూర సురేశ్, వెంకటస్వామిగౌడ్, శివయ్య, నాగారపు దేవేందర్, అంజయ్య, కిషన్‌రావు, షఫీ, తమీద్ తదితరులు ఉన్నారు.
వేడుకలకు ఏర్పాట్లు
బోయినపల్లి, జూలై 23: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు కొదురుపాకలో ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కొదురుపాక రైతు వేదికతోపాటు, ఎస్సారార్ జలాశయం కట్ట వద్ద (జీరో పాయింట్) పూలు, పండ్లతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటనున్నారు. అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వేడుకల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు కత్తెరపాక కొండయ్య పిలుపునిచ్చారు. ఈ క్ర మంలో కొదురుపాకలో ఎస్సారార్ కట్ట వద్ద ఏర్పాట్లను జోగినపల్లి రవీందర్రావు పరిశీలించారు.
ఘనంగా నిర్వహించేలా..
సిరిసిల్ల టౌన్, జూలై 23: బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లా కేంద్రం లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పట్టణ కార్యదర్శి మ్యాన రవి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9గంటలకు శివనగర్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు, 10గంటలకు క్యాంపు కార్యాలయం ప్రాంతంలోని బైపాస్ రోడ్డులో మొక్కలు నాటడం, 10.40గంటలకు గాంధీచౌక్ వద్ద కేక్ కటింగ్, 11గంటలకు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విజయవంతం చేయండి
వేములవాడ రూరల్, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ వేములవా డ రూరల్ మండలాధ్యక్షుడు గోస్కుల రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోమవారం ఉదయం 10గంటలకు చెక్కపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం కేక్ కట్ చేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
దుబాయిలో వేడుకలు
గంభీరావుపేట మండలంలో గజసింగవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ఆదివారం దుబాయిలో మంత్రి కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. రామన్నపై అభిమానంతో ముందస్తుగా దుబాయిలో జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఇక్కడ ఎన్నారైలు ఉమ్మారెడ్డి నవీన్‌రెడ్డి, రాము, అజయ్, మహేశ్‌గౌడ్, రాజయ్య, గోపి, మల్లేశ్, రవి ఉన్నారు.