Compensation must | చిగురుమామిడి, అక్టోబర్ 1 : హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు 4 వరుసల రహదారి ఏర్పాటులో భాగంగా చిగురుమామిడి గ్రామంలో ఊరులో నుండి నాలుగు రహదారుల విస్తరణలో 211 ఇండ్లు, 300 కుటుంబాలు కుటుంబాలు కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఏర్పడుతుందని వారికి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి అంజయ్య డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న బాధితులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఊర్లో నుండి రహదారిని వెడల్పు చేసినట్లయితే వందలాది కుటుంబాలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేనిచో బైపాస్ నుండి రోడ్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశ బోయిన రాజు, కత్తుల రమేష్, శ్యామకూర సంపత్ రెడ్డి, బాధితులు గుగ్గిల వేణు, తిరుపతి, బాలరాజు, రాజిరెడ్డి, అంజయ్య, తిరుపతి, లక్ష్మీ, రవీందర్, వెంకయ్య, స్వర్ణ, కనకవ్వ, రజిత తదితరులు పాల్గొన్నారు.