వేడుకలా ‘బాజిరెడ్డి నామినేషన్’
నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లగా, ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు.
- నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా దాఖలు
ఖలీల్‌వాడి/జగిత్యాల, ఏప్రిల్ 19 : నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లగా, ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి ఝూటా కోర్
కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నరు. ఆ పార్టీలను మరోసారి నమ్మితే చెవిలో పువ్వు, నెత్తిన చెయ్యిపెట్టి నిండా ముంచుతరు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఎటు పోయింది? పొద్దున లేస్తే ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, హిందూ, ముస్లిం వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టడమే తప్ప ప్రజలకు చేసింది శూన్యం. రాముడి సద్గుణాలను ఆచరించాలే గానీ రామనామజపంతో రాజకీయం చేయడమేంటి? మోదీ పేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయింది? ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు ఎంపీలుగా పనిచేసి జిల్లాకు చేసిందేమీ లేదు.
అందుకే అర్వింద్ గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలు తిరగబడి కొట్టిన్రు. ఈ ఎన్నికల్లో ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏనాడైనా జిల్లాకు వచ్చాడా..? రేవంత్‌రెడ్డి ఝూటాకోర్. ఆయన దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిండు. అధికారంలోకి వచ్చినవెంటనే రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌రెడ్డి 135 రోజులు గడుస్తున్నా అమలు చేయలేదు. ఇప్పుడు పంద్రాగస్టు వరకు మాఫీ చేస్తామని మళ్లీ అబద్ధాలు చెబుతున్నడు. నన్ను 40 ఏండ్లుగా ప్రజలు ఆదరిస్తున్నరు. అందుకే రాజకీయాల్లో ఉంటూ సేవచేస్తున్న. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించండి. నేను గెలిస్తే కొట్లాడి నిధులు తెస్త.
– బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

