Vemulawada | బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోం.. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించబోమని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు.
Vemulawada | వేములవాడ రూరల్ : బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించబోమని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన గుడి రత్నాకర్ రెడ్డిపై వట్టెంల సర్పంచ్ రంగు వెంకటేష్ గౌడ్ అతని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా రత్నాకర్ రెడ్డిని ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ సర్పంచి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరుగుతున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆధ్వర్యంలో పడొద్దని అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఘటనలకు రానున్న రోజుల్లో సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు గోస్కుల రవి, హనుమాన్లు, యామ తిరుపతి, ఏశ తిరుపతి, మంద శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

