అల్విన్ ఫ్రిడ్జ్ @ 60 ఏండ్లు
సాధారణంగా ఒక రిఫ్రిజిరేటర్ పది, పన్నెండేండ్లు మన్నికగా ఉంటుంది. మహా అయితే ఓ పదిహేనేండ్లు పనిచేస్తుంది. కానీ, జగిత్యాలలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాపులో ఉన్న ఫ్రిడ్జ్ మాత్రం ఇప్పటికీ చక్కగా పనిచేస్తున్నది.
- ఇప్పటికీ చెక్కుచెదరని నిజాం కంపెనీ రిఫ్రిజిరేటర్
సాధారణంగా ఒక రిఫ్రిజిరేటర్ పది, పన్నెండేండ్లు మన్నికగా ఉంటుంది. మహా అయితే ఓ పదిహేనేండ్లు పనిచేస్తుంది. కానీ, జగిత్యాలలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాపులో ఉన్న ఫ్రిడ్జ్ మాత్రం ఇప్పటికీ చక్కగా పనిచేస్తున్నది. ఒకటికాదు రెండు కాదు అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకొని 60వ ఏటకు చేరువవుతున్నది. అయితే ఇది ఎంతో గుర్తింపు పొందిన అల్విన్ కంపెనీ బ్రాండ్ కావడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నదని మెడికల్ షాప్‌ను ప్రారంభించిన గరిపెల్లి వెంకటరాములు వారసులు చెబుతున్నారు.
తమ తండ్రి ఈ ఫ్రిడ్జ్‌ను 1965 ప్రాంతంలో 1099కి కొనుగోలు చేశాడని, అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నదని, ఇంత వరకు రిపేర్ రాలేదని చెబుతున్నారు. ఈ షాప్‌నకు 55 ఏండ్లుగా వస్తున్నానని, ఫ్రిజ్‌ను చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతున్నదని రిటైర్డ్ టీచర్ మ్యాడారం రాములు చెబుతున్నారు. హైదరాబాద్ అల్విన్ లిమిటెడ్ కంపెనీకి ఘనమైన చరిత్ర ఉన్నదని, దీనిని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1942లో ప్రారంభించారని గుర్తు చేశారు.
– జగిత్యాల, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

