Renikunta | రేణికుంట ప్రభుత్వ పాఠశాలలో 2004-05 టెన్త్బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశారు. 20 ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థిని, విద్యార్థులు ఒకే చోట కలిసి తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
Renikunta | తిమ్మాపూర్, జూన్29: రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశారు. 20 ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థిని, విద్యార్థులు ఒకే చోట కలిసి తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 20సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు. ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలుఅందచేస్తూ వేదికపైకి సగౌవరంగా తీసుకెళ్లారు.
అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు విద్యబుద్ధులు నేర్పిన ఇద్దరు గురువులు, విద్యను అభ్యసించిన ముగ్గురు మిత్రులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, బాపురెడ్డి, రాయమల్లు, భరత్ రెడ్డి, పద్మజా, సునీత, పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

