సదరం శిబిరానికి స్పందన

హుజూరాబాద్‌లో క్యాంపునకు పెద్దసంఖ్యలో దివ్యాంగులు
ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు 2200 మందికి పరీక్షలు
సందర్శించిన దివ్యాంగుల సహకార సంఘం చైర్మన్ వాసుదేవరెడ్డి
హుజూరాబాద్, ఆగస్టు 5 : హుజూరాబాద్ ఏరియా దవాఖానలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే హుజూరాబాద్ బాట పట్టారు. బండ్లు, బస్సులు, ఆటోల్లో తరలివచ్చారు. అంచనాలకు మించి మంది వచ్చినా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. శిబిరంలో సకల సౌకర్యాలు కల్పించారు. నీడ కోసం టెంట్, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. వచ్చిన వారి కోసం కుర్చీలను సిద్ధం చేశారు. చెవి, ముక్కు, గొంతు, మానసిక వ్యాధులతో పాటు ఇతర అంగవైకల్యం ఉన్నవాళ్లకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 2200 మందికి వైద్య సిబ్బంది ఓపికగా పరీక్షలు చేశారు. వీరందరికి సర్టిఫికెట్లు ఇంటికే పంపిచనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్, ఆర్ఎంవో శ్రీకాంత్‌రెడ్డి, వైద్య బృందం తదితరులున్నారు.
నేడు జమ్మికుంటలో సదరం శిబిరం
జమ్మికుంట, 5 ఆగస్టు : జమ్మికుంట శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జమ్మికుంట ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. చెవి, ముక్కు, గొంతు, కాళ్లు, చేతులు, నేత్రాలు, మానసిక వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్ ఇంటికే పంపిస్తమన్నరు..
నాకు ఏడాది కింద పక్షవాతం వచ్చింది. కాలు, చెయ్యి పనిచేయడంలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న. పనిచేసేందుకు శరీరం సహకరిస్తలేదు. ప్రభుత్వం పింఛన్ ఇచ్చేందుకు క్యాంపు పెడుతున్నారని తెలుసుకుని వచ్చిన. ఇక్కడ డాక్టర్లు నాకు పరీక్షలు చేసిన్రు. ఇంటికే సర్టిఫికెట్ పంపిస్తమని చెప్పిన్రు.
- పల్లెపు శంకర్, హుజూరాబాద్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

