ఈ నెల 14న వెస్లీ కళాశాలలో మెగా జాబ్‌మేళా

బేగంపేట్ : నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఈ నెల 14న సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని వెస్లీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెస్లీ పీజీ కళాశాల డైరక్టర్ డాక్టర్ విమల్ సుకుమార్ తెలిపారు. గురువారం కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జాబ్‌మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన స్పైస్ జాబ్ , వైఎంసీఏ అధ్యక్షుడు డానియల్‌తో కలిసి ఆవిష్కరించారు.
స్పైస్ జాబ్, వైఎంసీఏ, వెస్లీ కళాశాల, ఎన్‌జివోలతో కలిసి జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ..వెస్లీ కళాశాలలో 14న 40 కంపెనీలతో కలిసి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో మల్టినేషనల్ కంపెనీలు కూడా పాల్గొంటున్నట్టు తెలిపారు. పదవ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ కోర్సులు చదివిన విద్యార్ధుల వరకు ఈ జాబ్‌మేళాలో పాల్గొని అర్హతలను బట్టి ఉద్యోగం పొందవచ్చునని చెప్పారు.
కరోనా కారణంగా ఉద్యోగాలు పోయిన వారు, వివిధ కోర్సులు చేసి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న యువతకు సుమారుగా 5 వందల వరకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మద్య ఉన్న యువత ఈ మేళాలో పాల్గొనవచ్చునని చెప్పారు.
ఇతర వివరాలు 8885410555…..8885073555 నెంబర్లలో సంప్రదించాలని నిర్వహాకులు కోరారు. మేళాకు వచ్చే వారు ఉదయం 9.30 గంటలకు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పైస్ జాబ్ సంస్ధ సీఈవో జాన్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Interview News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

