వాళ్లేం పాపం చేశారు?
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు (ఎన్హెచ్ఎం) చేపట్టిన నిరవధిక సమ్మె రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, తెలంగాణ డయాగ్నొస్టిక్స్ కేంద్రాల్లో సేవలు నిలిచిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏండ్లుగా 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలనేదే వారి ప్రధాన డిమాండ్.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు (ఎన్హెచ్ఎం) చేపట్టిన నిరవధిక సమ్మె రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, తెలంగాణ
డయాగ్నొస్టిక్స్ కేంద్రాల్లో సేవలు నిలిచిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏండ్లుగా 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలనేదే వారి ప్రధాన డిమాండ్.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల కృషి లేకుండా తెలంగాణ ఆరోగ్య చరిత్రను ఊహించలేం. నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్స్‌లో తెలంగాణను11వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర ఎంతో ఉన్నది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను 31 శాతం నుంచి 70 శాతానికి పెంచి, పేద మహిళలను ప్రైవేట్ దవాఖానల దోపిడీ నుంచి కాపాడింది వీరే. మాతృ మరణాల రేటును 25 నుంచి 19కి, శిశు మరణాలను 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. 2.98 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి అంధత్వ రహిత రాష్ట్రంగా మార్చడంతో పాటు టీబీ నిర్మూలనలో జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించడం, జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు మన ఆరోగ్య కేంద్రాలకు దకేలా చేయడం వెనుక ఎన్హెచ్ఎంల శ్రమ దాగున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే ప్రతి కార్యక్రమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నది వీరే.
బస్తీ దవాఖాన, పల్లె దవాఖాన, హైరిస్ డెలివరీల నిర్వహణ, తెలంగాణ డయాగ్నొస్టిక్స్, ఆడబిడ్డలకు అండగా నిలిచిన ఆరోగ్య మహిళ కార్యక్రమం, పుట్టిన పిల్లల నుంచి 18 ఏండ్ల వయసు వారికి గుండె, చీలిన పెదవి, గ్రహణ మొర్రి, వక్రపాదం వంటి ఖరీదైన సర్జరీలను ఉచితంగా చేయించే డీఈఐసీ సెంటర్ల నిర్వహణలో ఈ సిబ్బంది సేవలు ఎనలేనివి. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో వారి సేవలు వెలకట్టలేం. అలాంటి వారి పట్ల నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ద్రోహానికి పరాకాష్టగా మారింది.
అధికారంలోకి వస్తే ఎన్హెచ్ఎం ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా, ఆశా వరర్లు, ఫీల్డ్ స్థాయి కాంట్రాక్ట్ సిబ్బంది సంక్షేమం, గౌరవ వేతనం పెంపు వంటి సాధారణ హామీలతో మభ్యపెట్టింది. ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని నమ్మబలికింది. కానీ అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ గాలికి వదిలేసింది. పైగా ఉన్న ఉద్యోగాలకే ఎసరుపెట్టేలా జీవో 1195ను తీసుకొచ్చి ఉద్యోగుల గొంతు నులిమింది. నిబద్ధతతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం, సమ్మతి లేకుండా ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేయడానికి ఈ జీవో వీలు కల్పిస్తున్నది.
హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ర్టాలు ఎన్హెచ్ఎం ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయి. సర్కార్‌పై ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండానే ఇది సాధ్యమని నిరూపించాయి. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్వయంగా జేఏసీ నేతలు చెప్తున్నా సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది.
అయినా రేవంత్ సర్కార్ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.ప్రతి క్యాడర్‌కూ ఫిక్సేషన్ చేసి 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, జీతాలను ప్రతి నెలా 5వ తేదీలోపు చెల్లించాలని అడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మహిళా సిబ్బందికి క్యాడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదు. విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగం ఇవ్వాలన్న మానవీయ కోణాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
ఇతర ఉద్యోగులపై చూపిన పెద్ద మనసు రాష్ట్ర సర్కార్ తమపై ఎందుకు చూపడం లేదని ఎన్హెచ్ఎం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి న్యాయం చేయాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.
Read Today's Latest Interview News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

