Zoom Jobcuts: జూమ్‌లో 1300 మంది ఉద్యోగుల తొలగింపు..
Zoom Job Cuts: జూమ్ కంపెనీలో 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ప్రకటించారు. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు అరగంటలో ఇంపాక్టడ్ మెయిల్ వస్తుందన్నారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ జూమ్ సుమారు 1300 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించనున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్ తెలిపారు. కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేయనున్నట్లు యువాన్ చెప్పారు. అరగంటో ఇంపాక్టడ్ అని మెయిల్ వస్తుందని అన్నారు. ఇక అమెరికా బయట ఉన్న ఉద్యోగులకు స్థానిక విధానాలను బట్టి సమాచారం చేరవేయనున్నట్లు తెలిపారు.
అమెరికాలో ఉద్యోగం కోల్పోనున్న జూమీలకు 16 నెలల జీతం ఇవ్వనున్నట్లు సీఈవో యువాన్ చెప్పారు. హెల్త్‌కేర్ కవరేజ్ కూడా ఉంటుంది. 2023 సంవత్సరానికి చెందిన బోనస్ కూడా ఉంటుందని వెల్లడించారు. స్థానిక చట్టాలను బట్టి ఇతర దేశాల్లో ఉద్యోగుల కొనసాగింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇటీవల ఆర్ధికమందగమనం వల్ల చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోహన రూపంతో సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

