Zoom Calls: కొంప ముంచిన జూమ్ కాల్స్.. ఉద్యోగాలు గల్లంతు.. ఎందుకో తెలుసా?
జూమ్.. ఈ కరోనా కాలంలో ఎన్నో కంపెనీలు, ఉద్యోగులు, చివరికి విద్యార్థులకు కూడా ఎంతో మేలు చేసింది. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాస్‌లకు ఇది బాగా ఉపయోగపడింది. అయితే అదే సమయంలో ఈ జూమ్ కాల్స్( Zoom Calls ) ఎంతో మంది ఉద్యోగాలు పోవడానికీ పరోక్షంగా కారణమైందని తాజాగా ఓ సర్వే తేల్చింది.

న్యూఢిల్లీ: జూమ్.. ఈ కరోనా కాలంలో ఎన్నో కంపెనీలు, ఉద్యోగులు, చివరికి విద్యార్థులకు కూడా ఎంతో మేలు చేసింది. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాస్‌లకు ఇది బాగా ఉపయోగపడింది. అయితే అదే సమయంలో ఈ జూమ్ కాల్స్( Zoom Calls ) ఎంతో మంది ఉద్యోగాలు పోవడానికీ పరోక్షంగా కారణమైందని తాజాగా ఓ సర్వే తేల్చింది. ఇందులో భాగంగా 200 మంది మేనేజర్లతో మాట్లాడగా.. ప్రతి నలుగురిలో ఒకరు తాము తమ ఉద్యోగులను తొలగించినట్లు చెప్పడం గమనార్హం. మరి జూమ్ కాల్స్‌కూ, వీళ్ల ఉద్యోగాలు పోవడానికి సంబంధం ఏంటనేగా మీ డౌట్. అదే ఇప్పుడు చెప్పబోయేది.
ఏంటీ సర్వే?
వయోటా ఐఎన్‌సీ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జులై 20 నుంచి ఆగస్ట్ 10 మధ్య ఈ సర్వే చేశారు. కనీసం 500 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లోని వైస్‌ప్రెసిడెంట్, అంతకు మించిన హోదాలో ఉన్న 200 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
సర్వే తేల్చిందేంటి?
జూమ్ కాల్స్‌కు ఈ మధ్య భారీగా డిమాండ్ పెరిగిపోయింది. 2019లో రోజుకు సగటున కోటి మంది ఈ జూమ్ కాల్స్‌లో పాల్గొనగా.. కరోనా ప్రారంభమైన తర్వాత ఇది మూడు కోట్లకు పెరిగింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న తమ ఉద్యోగులతో వీడియో కాల్స్ కోసం ఈ జూమ్నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ జూమ్ కాల్స్‌తోనే చాలా మంది ఉద్యోగులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆన్లైన్ మీటింగ్‌లకు ఆలస్యంగా రావడం, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం, సున్నితమైన సమాచారాన్ని అనుకోకుండా అందరితో షేర్ చేయడం, మ్యూట్‌లో ఉన్నామో లేదో చెక్ చేయకుండా నోరు జారడం, కెమెరా ఆఫ్ చేయకుండా ఏవో వ్యక్తిగత పనులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు.
ఇలాంటి పనులు ఆయా బిజినెస్‌లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి కారణమైన వాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ మ్యాగజైన్ రైటర్ జెఫ్రీ టూబిన్ ఇలాగే దొరికిపోయి ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి. సర్వేలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్‌లు ప్రతి నలుగురిలో ఒకరు జూమ్ కాల్స్‌లో ఇలాంటి పనులు చేసినందుకు తమ ఉద్యోగులను తీసేసినట్లు చెప్పడం గమనార్హం. అంతేకాదు ఆఫీస్‌లో కంటే రిమోట్‌గా పని చేసే తమ ఉద్యోగులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడం లేదని కూడా మేనేజర్లు భావిస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Pintop
- Vyopta Inc.
- zoom
- Zoom Calls
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

