Zombie Virus | 48 వేల ఏండ్ల తర్వాత బయటకొచ్చిన డేంజరస్ వైరస్.. కరోనాను మించిన ప్రళయం తప్పదా?
Zombie Virus | అదొక డేంజరస్ వైరస్! అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు! కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు! విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తున్న జాంబీ వైరస్ కథ ఇదీ! నిన్నటిదాకా ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్.. తొందరలోనే నిజం కాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Zombie Virus | అదొక డేంజరస్ వైరస్! అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు! కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు! విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తున్న జాంబీ వైరస్ కథ ఇదీ! నిన్నటిదాకా ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్.. తొందరలోనే నిజం కాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేల ఏండ్లుగా మంచులో కప్పబడిన ఈ వైరస్లు.. ఇప్పుడు బయటకు వస్తుందన్న అంచనాతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం నుంచి ఇంకా బయటపడకముందే.. అంతకుమించిన ప్రమాదకరమైన వైరస్లు మనుషులపైకి దండయాత్ర చేసేందుకు వస్తుందన్న విషయం తెలిసి బెంబేలెత్తిపోతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్‌లోని మంచు వేగంగా కరిగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్ మంచు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్ మార్సిల్లే పరిశోధకులకు చెమటలు పట్టే నిజాలు తెలిశాయి.వేల ఏండ్ల క్రితం ఆర్కిటిక్ మంచులో గడ్డకట్టుకుపోయిన.. ప్రమాదకరమైన వైరస్లు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న విషయం వారి పరిశోధనల్లో వెల్లడైంది. భూతాపం కారణంగా మంచు కరిగిపోవడంతో.. ఇప్పుడు ఆ వైరస్లు బయటకు వస్తున్నాయని తెలిసింది. రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు.. 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు.. వీటిలో 48,500 ఏండ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్లు కూడా ఉన్నాయని గుర్తించారు.ఈ వైరస్లు ఇంకా సజీవంగానే ఉన్నాయని.. తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఆర్కిటిక్‌లోని మంచు కరిగిపోవడంతో అందులోని వైరస్లు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తాయని.. ముఖ్యంగా జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి దక్షిణ ప్రాంతాల్లో మొదలై.. ఉత్తర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని ఎయిక్స్ మార్సిల్లే పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాంబీ వైరస్లు బయటకొస్తే పురాతన పోలయో తరహా అనారోగ్యాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ల కారణంగా ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. .. మానవాళి మనుగడకే ప్రమాదం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

