Zelenskyy | ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై జూలై కల్లా తేల్చండి : జెలెన్స్కీ
Zelenskyy : నాటో సభ్యత్వం(NATO membership)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ(Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటో మెంబర్షిప్ విషయమై జూలై కల్లా స్పష్టమైన ప్రకటనను కీవ్ కోరుకుంటుందని ఆయన అన్నాడు. యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ చేరికపై కూడా పురోగతి...
Zelenskyy : నాటో సభ్యత్వం(NATO membership)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ(Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటో మెంబర్షిప్ విషయమై జూలై కల్లా స్పష్టమైన ప్రకటనను కీవ్ కోరుకుంటుందని ఆయన అన్నాడు. యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ చేరికపై కూడా పురోగతి ఆశిస్తున్నటు జెలెన్స్కీ వెల్లడించాడు. ‘ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సంవత్సరం. జూలై నెలలో మాల్డోవాలో జరగనున్న నాటో సమావేశంలో ఉక్రెయిన్ సభ్యత్వం గురించి స్పష్టమైన, సానుకూలమైన నిర్ణయం వెలువరించాలి.
అంతేకాదు రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి మేము శాంతి సమావేశం కోసం సన్నద్ధమవుతున్నాం. దానివల్ల ప్రపంచమంతా శాంతి సందేశాన్ని(సూత్రాన్ని) ఆచరణలోకి తెచ్చేలా చేస్తుంది’ అని జెలెన్స్కీ తెలిపాడు. నాటో సమావేశంలో 40 యూరోపియన్ దేశాల ప్రతినిధులు పొల్గొననున్నారు. అయితే.. ఉక్రెయిన్ కోరుతున్న శాంతి సమావేశం నిర్వహణపై నాటో ఇంతవరకు నిర్ణయం వెల్లడించలేదు.
10 పాయింట్లతో పీస్ ఫార్మూలా
ఉక్రెయిన్ నాటోలో చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రష్యా ఏకంగా యుద్ధానికి తెరలేపింది. ఇరుదేశాల దాడుల్లో ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తోంది. అందుకని నాటో సమావేశంలో శాంతి సమావేశం నిర్వహించాలని పట్టుపడుతోంది. జెలెన్స్కీ 10 పాయింట్లతో కూడిన పీస్ ఫార్మూలాను ప్రతిపాదించాడు. వాటిలో ఏం ఉందంటే..? ఉక్రెయిన్ నుంచి రష్యా సైనిక దళాలు వెనక్కి వెళ్లిపోవాలి. అంతేకాదు రష్యా ఆర్మీని దేశం దాటించేందుకు యుద్ధ విమానాల సాయం తీసుకుంటామని చెప్పాడు. అందుకనే ఆయన నాటోలో శాంతి సమావేశం పెట్టాలని ఒత్తిడి తెస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Jordan Royal Wedding | సౌదీ ఆర్కిటెక్ట్‌తో జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ వెడ్డింగ్.. హాజరుకానున్న దేశాధినేతలు, రాజులు
Dream Dog House | పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

