Jordan Royal Wedding | సౌదీ ఆర్కిటెక్ట్‌తో జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ వెడ్డింగ్.. హాజరుకానున్న దేశాధినేతలు, రాజులు
Jordan royal wedding | జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ (Crown Prince) ఆల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ( Al Hussein bin Abdullah II) వెడ్డింగ్.. సౌదీ వ్యాపారవేత్త ఖలీద్ అల్ సైఫ్ కుమార్తె, సౌదీ ఆర్కిటెక్ట్ రాజ్వా అల్ సైఫ్ (Rajwa Al Saif) తో గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది.
Jordan royal wedding | జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ (Crown Prince) ఆల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ( Al Hussein bin Abdullah II) వెడ్డింగ్.. సౌదీ వ్యాపారవేత్త ఖలీద్ అల్ సైఫ్ కుమార్తె, సౌదీ ఆర్కిటెక్ట్ రాజ్వా అల్ సైఫ్ (Rajwa Al Saif) తో గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. జోర్డాన్‌లోని అమ్మన్లో గల జహ్రాన్ ప్యాలెస్‌లో వీరి రాయల్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ వేడుకకు పలు దేశాధినేతలు, రాజులు హాజరుకానున్నారు. కాగా, మే 23వ తేదీ నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మెహందీ, ఇతర సాంప్రదాయ వేడుకలను ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు.
హుస్సేన్-రాజ్వా ఎంగేజ్మెంట్ 2022 ఆగస్టు 17న రియాద్‌లోని వధువు ఇంట్లో జరిగింది. ఆ సమయంలో క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ తనకు కాబోయే భార్యకు అత్యంత ఖరీదైన పియర్-కట్ డైమండ్ హ్యారీ విన్స్టన్ ఉంగరాన్ని బహూకరించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

బ్రిటన్ ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్, కింగ్‌ఆఫ్ బెల్జియన్స్, డెన్మార్క్ క్రౌన్ ప్రిన్సెస్ మేరీ, ప్రిన్స్ విక్టోరియా, స్వీడన్ ప్రిన్స్ డేనియల్, జపాన్ యువరాణి హిసాకోవా, ఆమె కుమార్తె ప్రిన్సెస్ సుగుకో, నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకోన్, ప్రిన్స్ సెక్స్బాస్టియెన్ తదితరులు హాజరుకానున్నారు. వీరితోపాటు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కూడా ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు పలు దేశాల అధ్యక్షులు, రాజులు వివాహ వేడుకలో పాల్గొననున్నారు. మరోవైపు క్రౌన్ ప్రిన్స్ వెడ్డింగ్ సందర్భంగా జోర్డాన్ వ్యాప్తంగా కొత్త జంట ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జోర్డాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో హుస్సేన్-రాజ్వా ఫొటోలను ఏర్పాటు చేశారు.
Also Read..
Mumbai Airport | బ్యాగ్‌లో బాంబు ఉందంటూ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మహిళ హల్చల్
Dream Dog House | పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

