ప్లేబాయ్నే.. దేవదూతను కాను: ఇమ్రాన్ ఖాన్
Imran Khan playboy ఒకప్పుడు తానే ప్లేబాయ్నే అని, తానేమీ దేవదూతను కాదు అని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ముందు రిటైర్డ్ మాజీ ఆర్మీ జనరల్ జావెద్ బాజ్వా తనను ప్లేబాయ్ అని ఆరోపించినట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇటీవల ఇమ్రాన్ స్వరంతో రిలీజైన కొన్ని అసభ్యకర ఆడియోల గురించి మాట్లాడు
లాహోర్: ఒకప్పుడు తానే ప్లేబాయ్నే అని, తానేమీ దేవదూతను కాదు అని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ముందు రిటైర్డ్ మాజీ ఆర్మీ జనరల్ జావెద్ బాజ్వా తనను ప్లేబాయ్ అని ఆరోపించినట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇటీవల ఇమ్రాన్ స్వరంతో రిలీజైన కొన్ని అసభ్యకర ఆడియోల గురించి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు.
గలీజ్ ఆయోలు, వీడియోలతో యువతకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నామని ఆయన ప్రశ్నించారు. అటువంటి ఆడియోలను రికార్డు చేస్తున్న విధానాన్ని ఇమ్రాన్ తప్పుపట్టారు. ఇటీవల ఇమ్రాన్‌ను చెందిన మూడు ఆడియో క్లిప్‌లు రిలీజైన విషయం తెలిసిందే. ఆ ఆడియో క్లిప్‌లు నిజమైనవని, రానున్న రోజుల్లో వీడియో క్లిప్‌లు కూడా రిలీజవుతాయని హోంశాఖ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.
అయితే గత ఏడాది ఆగస్టులో జనరల్ బాజ్వాతో జరిగిన సంభాషణల గురించి ఇమ్రాన్ మీడియాతో షేర్ చేసుకున్నారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన నేతల ఆడియోలు, వీడియో క్లిప్‌లు తన వద్ద ఉన్నట్లు జనరల్ బాజ్వా చెప్పారని, తనను ప్లేబాయ్ అని బాజ్వా పేర్కొన్న విషయాన్ని కూడా ఇమ్రాన్ గుర్తు చేశారు.
గతంలో తాను ప్లేబాయ్నే అన్న విషయాన్ని బాజ్వాకు చెప్పానని, కానీ తానేమీ దేవదూతను కాదు అని అన్నారు. ఆ సమయంలోనే తనను ప్రధాని నుంచి తప్పించాలని బాజ్వా పన్నాగం వేశారని ఇమ్రాన్ ఆరోపించారు. బాజ్వా డబుల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని పసికట్టానని, షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని చేయాలని బాజ్వా ప్రయత్నించారని, దాని కోసం అతను వెన్నుపోటు పొడిచారని ఇమ్రాన్ అన్నారు.
తనను అధికారంలోకి రాకుండా చూసేందుకు ఇప్పటి మిలిటరీలో బాజ్వా వ్యక్తులు పనిచేస్తున్నారని ఇమ్రాన్ వెల్లడించారు. జనరల్ బాజ్వాకు పొడిగింపు ఇచ్చి పొరపాటు చేసినట్లు ఇమ్రాన్ పేర్కొన్నారు. జవాబుదారీతనం పేరుతో తన ప్రభుత్వాన్ని కూల్చారని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

