టొరంటో, సెప్టెంబర్ 7: ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వీడియోగేమ్ను అభివృద్ధి చేసిన బాలికగా సిమార్ ఖురానాను గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది. కెనడాలోని అంటారియాలో నివసిస్తున్న ఈ బాలిక 6 ఏండ్ల 335 రోజుల వయసులో వీడియోగేమ్ను అభివృద్ధి చేసింది.
గిన్నిస్ రికార్డు లభించడం సంతోషంగా ఉన్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధిస్తానని సిమార్ తెలిపింది. ఆమె తండ్రి స్పందిస్తూ సిమార్ చురుకుదనాన్ని చూసి కోచింగ్ ఇప్పించామని, దీంతో రికార్డు సృష్టించిందని వెల్లడించారు.