హువే: వియత్నాంకు చెందిన ప్రఖ్యాత బౌద్ధ గురువు థిచ్ నాట్ హన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. జెన్ బోధన పధ్ధతులకు ఆయన చాలా ఫేమస్. థిచ్నాట్ హన్ తుదిశ్వాస విడిచినట్లు జెన్ సంస్థ తన ట్విట్టర్లో పేర్కొన్నది. హువే నగరంలోని టూ హియీ ఆలయంలో ఆయన అంతిమ శ్వాస విడిచారు. వియత్నాంలో బౌద్ధమతస్తులు థిచ్ను ఆధ్మాత్మిక గురువుగా కీర్తిస్తారు. పశ్చిమ దేశాల్లో బౌద్ధ ప్రార్థన విధానాలను ఆయన ప్రచారం చేశారు. హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సిలికాన్ వ్యాలీ సీఈవోల వరకు ఆయన్ను ఫాలోఅయ్యారు. 2018లో ఆయన వియత్నాంకు తిరిగి వచ్చారు. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అంశాలపై ఆయన వందలాది పుస్తకాలు రాశారు. బౌద్ధ గురువు దలైలామా తర్వాత రెండవ పెద్ద గురువుగా థిచ్ను పూజిస్తారు. లక్షలాది మంది థిచ్ ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకట్టుకునేవారు.