World Heart Day : గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
World Heart Day : నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రపంచ గుండె సమాఖ్య ఏటా సెప్టెంబర్ 29 న ప్రపంచ గుండె దినోత్సవాన్ని...

(World Heart Day) నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రపంచ గుండె సమాఖ్య ఏటా సెప్టెంబర్ 29 న ప్రపంచ గుండె దినోత్సవాన్ని జరుపుతుంది. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 1999 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ప్రారంభించారు. 2000 సెప్టెంబర్ 24 న తొలి ప్రపంచ గుండె దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇది 2011 వరకు కొనసాగింది. అనంతరం సెప్టెంబర్ 29 కి మార్చారు. హృదయ సంబంధ వ్యాధులపై పోరాడటానికి అవగాహన వ్యాప్తి చేయడానికి వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి.
గుండె జబ్బుల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది మరణిస్తున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, గుండెపోటు ఉన్న 50 శాతం మంది భారతీయ పురుషులు 50 ఏండ్లలోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్లలోపు వారు. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ ప్రకారం, గుండె జబ్బుల కారణంగా 57 శాతం మరణాలు 25-69 సంవత్సరాల మధ్య ఉన్న గుండె రోగాల వల్ల జరుగుతున్నాయి. 1990 లో దేశంలో గుండె రోగుల సంఖ్య కేవలం 2.57 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 54 కోట్లకు పైగా పెరిగింది. భారతదేశంలో వివిధ వ్యాధుల కారణంగా మరణించినవారిలో 28.1 శాతం మరణాలు గుండె జబ్బుల కారణంగా జరుగుతున్నాయి.
మనం తీసుకునే ఆహారం, రక్తపోటు, వాయు కాలుష్యం, హై కొలెస్ట్రాల్, సిగరెట్ స్మోకింగ్, ఊబకాయం కారణంగా గుండె జబ్బులు వస్తున్నందున వీటిపై దృష్టి సారించడం ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు గంట పాటు నడక, 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు శుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవాలి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2016: యురి దాడి అనంతరం పాకిస్తాన్ సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్ చేపట్టిన భారత్
2006: అంతరిక్ష పర్యటన ముగించుకున సురక్షితంగా భూమికి తిరిగివచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు అనుషే అన్సారీ
1994 : ఎస్టోనియాలో జరిగిన ఫెర్రీ మునక ప్రమాదంలో 852 మంది దుర్మరణం
1954 : సీఈఆర్ఎన్.. యురోపియన్ ఆటోమిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభం
1977: సాల్యూట్-6 అనే అంతరిక్ష కేంద్రాన్ని భూమి కక్ష్యలో ఉంచిన
సోవియట్ యూనియన్
1927: అమెరికా-మెక్సికో మధ్య టెలిఫోన్ సేవలు ప్రారంభం
1915: మొట్టమొదటి ఖండాంతర సందేశం టెలిఫోన్ ద్వారా పంపిన శాస్త్రవేత్తలు
1650: మొదటి వివాహ బ్యూరో ఇంగ్లండ్‌లో ప్రారంభం
ఇవి కూడా చదవండి..
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

